‘ఆనం’ అతిగా ఊహించుకుని టీడీపీలో చేరారు.. చంద్రబాబు ఆయనకు షాకిచ్చారు: విజయసాయిరెడ్డి
- చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విజయసాయి ‘ఎక్స్’
- ఆనం అడిగిన వెంకటగిరి సీటును బాబు అమ్మేసుకున్నారని ఆరోపణ
- గత్యంతరం లేక ఆత్మకూరు నుంచి ఆనం పోటీకి దిగుతున్నారని ఎద్దేవా
అతిగా ఊహించుకుని పార్టీలో చేరిన ఆనం రామనారాయణకు చంద్రబాబు షాకిచ్చారని విజయసాయి అందులో పేర్కొన్నారు. పార్టీలో చేరినప్పుడు ఆయన వెంకటగిరి సీటును అడిగారని, అయితే దానికి మంచి ధర పలకడంతో పచ్చపార్టీ ఆ టికెట్‌ను వేరొకరికి ఇచ్చిందని ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక ఆయన ఆత్మకూరు నుంచి పోటీ చేయకతప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఏదో అనుకుంటే ఇంకేదో మెడకు చుట్టుకుందని రామనారాయణరెడ్డి ఇప్పుడు కుమిలిపోతున్నారని పేర్కొన్నారు. 10 వేల కంటే ఎక్కువ తేడాతోనే ‘ఆనం’ పరాజయం పాలవుతాడని విజయసాయి జోస్యం చెప్పారు.