TDP-JanaSena-BJP Alliance: కృష్ణా జిల్లాలో బుధవారం నాడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారం... షెడ్యూల్ ఇదిగో!

Chandrababu and Pawan Kalyan will attend poll rallies in Krishna district tomorrow
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ రేపు (ఏప్రిల్ 17) కృష్ణా జిల్లాలో ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో వారు ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పెడనలో ప్రజాగళం సభ జరగనుంది. స్థానిక బస్టాండ్ సెంటర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు మచిలీపట్నం కోనేరు సెంటర్ లో వారాహి విజయభేరి సభ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.
Go Back to Shorts
TDP-JanaSena-BJP Alliance
Chandrababu
Pawan Kalyan
Krishna District
Praja Galam
Varahi Vijayabheri

More Telugu News