ప్రభుత్వ సలహాదారులకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుంది: ఈసీ
- ఏపీలో ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు
- రాజకీయ జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ
- కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ
నిర్దేశించిన విధులకు బదులుగా రాజకీయ జోక్యం చేసుకుంటున్నట్టు ప్రభుత్వ సలహాదారులపై ఈసీకి ఫిర్యాదులు అందాయి. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం... కోడ్ ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.