అందరి బండారం బయటపెడతా: తీహార్ జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరో లేఖ విడుదల
- కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌లు జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని వెల్లడి
- తీహార్ జైల్లో తమకు నచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చారని ఆరోపణ
- ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వవద్దని ఢిల్లీ మంత్రి తనను బెదిరిస్తున్నారన్న సుఖేశ్
- ఎవరు బెదిరించినా... నేతల బండారం బయటపెడతానని హెచ్చరిక
34 ఏళ్ల సుఖేశ్ చంద్రశేఖర్ బెంగళూరువాసి. మద్యం కేసులో రాజకీయ నాయకులతో పాటు సుఖేశ్ చంద్రశేఖర్ పేరు కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కొడుకుని అని, పీఎంవో అధికారిని అంటూ, సుప్రీంకోర్టు జడ్జిని అంటూ నమ్మించి రూ.200 కోట్లు మోసం చేసిన కేసులో సుఖేశ్ అరెస్టయ్యాడు. అతనిపై 15కు పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అతను జైల్లో ఉన్నాడు. గతంలోనూ ఆయన జైలు నుంచి లేఖ విడుదల చేశాడు. కవితతో తాను చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ అంటూ గతంలో విడుదల చేసి సంచలనం సృష్టించాడు.