సిడ్నీ మాల్‌లో కత్తిపోట్ల ఘటన కలకలం.. నలుగురి మృతి!
- సిడ్నీలోని బోండీ జంక్షన్ పరిధిలోని వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో ఘటన
- నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
- షాపింగ్ మాల్‌లోని వందల సంఖ్యలో జనం ఒక్కసారిగా పరుగు తీయడంతో భయానక పరిస్థితులు
అలాగే ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని పోలీసులు మట్టుబెట్టినట్లు 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' స్పష్టం చేసింది. కాగా, ఈ ఘటనతో షాపింగ్ మాల్‌లో ఉన్న వందల సంఖ్యలో జనం ఒక్కసారిగా పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాంతో పరిస్థితి భయానకంగా మారడంతో మాల్‌కు వచ్చిన కస్టమర్లను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. గాయపడిన వారిని అంబులెన్సులలో సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లారు.