Cred App: రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో డేవిడ్ వార్నర్.. కొత్త యాడ్ వీడియో చూస్తే న‌వ్వాపుకోలేరు..!

SS Rajamouli and David Warner Acted in Cred App Advt Video goes Viral on Social Media
షార్ట్స్‌లో చూడండి
ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి ఒక‌ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ యాడ్‌  తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొద‌ట‌ రాజమౌళి క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి ఫోన్ చేసి ఓ క్రికెట్ మ్యాచ్ టికెట్ల‌పై తనకు డిస్కౌంట్ కావాలని అడుగుతారు.

జక్కన్న ఇలా అడగడంతో 'క్రెడ్ యాప్' ఉందా? ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుంది అని వార్నర్ రిప్లై ఇస్తాడు. లేకపోతే ఏం చేయాలని రాజమౌళి అడుగుతారు. అక్క‌డి నుంచి యాడ్ స్టార్ట్ అవుతుంది. టికెట్ విషయంలో డిస్కౌంట్ కావాలి అంటే తనకు ఒక ఫేవర్ చేయాలని వార్న‌ర్ కోరుతాడు. దాంతో రాజమౌళి క‌ల‌లోకి వెళ్ల‌డం యాడ్‌లో చూపించారు. ఇందులో భాగంగా డేవిడ్ వార్నర్‌తో రాజమౌళి సినిమా చేస్తున్నట్టు ఏవేవో ఊహించుకుంటారు.

ఇక‌ వార్నర్ త‌న‌దైన శైలిలో యాక్టింగ్ చేసి, ఒక్కో షాట్‌ను ఖూనీ చేయడం చూసిన‌ రాజమౌళి తలపట్టేసుకుంటాడు. ఆ త‌ర్వాత‌ వార్నర్ తన యాక్టింగ్‌కు ఆస్కార్ వస్తుందని ఊహించి.. ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామని చెప్పడంతో ఒక్కసారిగా జ‌క్క‌న్న‌ షాక్ అవుతారు. అలా కలలోంచి తేరుకున్న త‌ర్వాత రాజ‌మౌళి.. తాను క్రెడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పేమెంట్ చేసేస్తాను అని చెప్ప‌డంతో యాడ్ ముగుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది. ఫ‌న్నీగా ఉన్న వీడియో చూసిన నెటిజ‌న్లు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. 

ఇక రాజ‌మౌళి ప్ర‌స్తుతం సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబుతో చేసే సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్‌గా ఈ చిత్రం ఉంటుంద‌ని కథా ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఇప్ప‌టికే వెల్ల‌డించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా భాగం కానున్నారు. దీంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Go Back to Shorts
Cred App
SS Rajamouli
David Warner
Viral Videos
Social Media

More Telugu News