Revuri Prakash Reddy: సెంటిమెంట్ కారణంగానే గతంలో కేసీఆర్ గెలిచారు: రేవూరి ప్రకాశ్ రెడ్డి

KCR won with Telangana sentiment says Revuri Prakash Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను ఉపయోగించుకునే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత రేవూర్ ప్రకాశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరితే బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని విమర్శించారు. గత సీజన్ లో వర్షాలు సరిగా పడకపోవడం వల్లే ఈ ఏడాది ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని... రాష్ట్రాన్ని రూ. 7 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Revuri Prakash Reddy
Congress
KCR
BRS

More Telugu News