అందరూ సీఎం జగన్ హృదయాన్ని మాత్రమే చూడండి: పిల్లి సుభాష్ చంద్రబోస్

Pilli Subhash Chandra Bose praises Jagan
  • 600 హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారన్న సుభాష్ చంద్రబోస్
  • ప్రతి హామీని నిలబెట్టుకున్న ఏకైక నేత జగన్ అని కితాబు
  • జగన్ కు కులం, మతం లేవని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు 600 హామీలను గాలికి వదిలేశారని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. ఈ వ్యత్యాసాన్ని ప్రజలందరూ గమనించాలని కోరారు. బీసీలపై చంద్రబాబుకు అంత దురభిప్రాయం ఎందుకో చెప్పాలని అన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాశారని విమర్శించారు. జగన్ కులం చూడలేదు, మతం చూడలేదని... కేవలం పేదరికాన్ని మాత్రమే చూశారని అన్నారు. అందరూ కూడా జగన్ హృదయాన్ని మాత్రమే చూడండని చెప్పారు. వైసీపీని గెలిపిస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుందని అన్నారు. 

Advertisement
Pilli Subhas Chandra Bose
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News