భార్యను 224 ముక్కలుగా నరికి నదిలో పారేశాడు.. రేపు శిక్ష ఖరారుచేయనున్న ఇంగ్లండ్ కోర్టు
- గతేడాది మార్చి 25న ఘటన
- అపార్ట్‌మెంట్‌లో దారుణంగా పొడిచి చంపిన నికోలస్
- శరీర భాగాలను ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి నదిలో పడేసిన నిందితుడు
- 8 రోజుల తర్వాత నదిలో లభ్యమైన బాధితురాలి శరీర భాగాలు
నిందితుడు నికోలస్ మెట్సన్ (28)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత నేరాన్ని నిరాకరించిన నికోలస్ ఆ తర్వాత అంగీకరించాడు. నిందితుడు గతంలోనూ తమ మాజీ భార్యలపై దారుణాలకు తెగబడిన కేసుల్లో 2013, 2016, 2017లో దోషిగా తేలాడు. తాజా కేసు విషయానికి వస్తే బ్రామ్లీని 2021లో వివాహం చేసుకున్నాడు. వారిప్పుడు విడిపోయే దశలో ఉండగా లింకన్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్యచేశాడు. ఈ కేసులో దోషిగా తేలిన మెట్సన్‌కు కోర్టు రేపు శిక్ష ఖరారుచేయనుంది.