KTR: విద్యార్థినులతో కలిసి ఫ్రూట్ జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగిన కేటీఆర్ 

KTR with school students
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. క్షణం తీరిక లేకుండా మొత్తం సమయాన్ని ప్రచారానికి వినియోగిస్తున్నారు. మరోవైపు ఎండలు మండిపోతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఎండల్లోనే ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తన ప్రచారం సందర్భంగా ఎండ వేడిమికి కాస్త విరామం తీసుకుని కొంత సమయాన్ని స్కూలు విద్యార్థినులతో కేటీఆర్ గడిపారు. ఓ ఫ్రూట్ జ్యూస్ షాపులో వారితో కలిసి పండ్ల రసాన్ని తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
Go Back to Shorts
KTR
BRS

More Telugu News