ప్రియుడిని పెళ్లాడిన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. అసలు విషయం ఏమిటంటే..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియుడిని పెళ్లాడిన తెలుగు బిగ్ బాస్ బ్యూటీ.. అసలు విషయం ఏమిటంటే..!

Bigg Boss beauty Priyanka Jain marries her lover
  • 'జానకి కలగనలేదు' సీరియల్ తో పాప్యులర్ అయిన ప్రియాంక జైన్
  • బుల్లితెర నటుడు శివకుమార్ ప్రేమలో ప్రియాంక
  • ఓ షూటింగ్ లో భాగంగా పెళ్లి చేసుకున్న ప్రేమికులు
'జానకి కలగనలేదు', 'మౌనరాగం' సీరియల్స్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్.... బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 7లో సందడి చేసింది. ఆ సీజన్ లో టాప్ 5లో నిలిచి సత్తా చాటింది. సీరియల్స్ నటుడు శివకుమార్ తో ఆమె అప్పటికే ప్రేమలో ఉంది. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే ఆమె తన ప్రియుడు శివకుమార్ ను అందరికీ పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకు రాగానే అందరికీ గుడ్ న్యూస్ చెపుతానని ఆమె తెలిపింది. ఆ గుడ్ న్యూస్ వీరి పెళ్లి వార్తే అయి ఉంటుందని అందరూ అనుకున్నారు. 

అయితే, తన అభిమానులకు ప్రియాంక షాక్ ఇచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండానే ప్రియుడిని పెళ్లాడింది. తమ పెళ్లి అయిపోయింది అంటూ కొత్త దంపతులు ఇద్దరూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ పెళ్లి వీడియో చూసి అందరూ నిజమే అనుకున్నారు. కానీ, అది నిజమైన పెళ్లి కాదు. ఓ షూటింగ్ లో భాగంగా తీసింది. ఉగాది పండుగ సందర్భంగా 'మా ఇంటి పండుగ' అనే షూటింగ్ జరిగింది. ఇందులో భాగంగానే ప్రియాంక, శివకుమార్ ల పెళ్లి జరిగింది.
Advertisement
Priyanka Jain
Bigg Boss
Marriage

More Telugu News