రోహిత్ శర్మను భయపెట్టిన అభిమాని.. ఇదిగో వీడియో!
- సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించిన అభిమాని
- రోహిత్ శర్మను కౌగిలించుకున్న ఫ్యాన్.. ఊహించని పరిణామంతో ఉలిక్కిపడ్డ హిట్‌మ్యాన్
- నిన్నటి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఘటన
ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి ప్రవేశించాడు. అనంతరం నేరుగా రోహిత్ శర్మ వద్దకు పరిగెత్తుకువచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హిట్‌మ్యాన్.. ఆ అభిమానిని కౌగిలించుకుని మైదానం నుంచి బయటికి వెళ్లాలని కోరాడు. ఇక రోహిత్‌ను కౌగిలించుకున్న ఆ వ్యక్తి తర్వాత పక్కనే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్‌తో కరచాలనం చేసి గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని మైదానం నుంచి బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.