అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఎక్కువే వస్తాయ్: గడ్కరీ
- ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలపై కేంద్ర మంత్రి వివరణ
- టీఆర్పీ ఎక్కువున్న చానళ్లకే యాడ్స్ ఎక్కువిస్తారంటూ పోలిక
- పార్టీ నడిపేందుకు లీగల్ గా విరాళాలు స్వీకరించామన్న గడ్కరీ
అయితే, ఈ విరాళాల స్వీకరణ అనేది చట్టబద్ధంగా, న్యాయంగా జరగాలని మంత్రి చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ జెండా ఎగురుతుందని, మూడోసారి కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పాటవుతుందని దీమా వ్యక్తం చేశారు. బీజేపీ సొంతంగా 370 సీట్లకు పైగా గెలుచుకుంటుందని, ఎన్డీయే కూటమికి 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పారు. ప్రధాని పదవి రేసులో తాను ఉన్నాననే ప్రచారాన్ని గడ్కరీ తోసిపుచ్చారు. తనకలాంటి ఆలోచనలేమీ లేవని, మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు.
కేంద్ర విచారణ సంస్థలను బీజేపీ ఓ ఆయుధంగా వాడుకుంటోందని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి వాటిని ఉసిగొల్పుతోందనే ఆరోపణలపైనా కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థల పనిలో బీజేపీ వేలు పెట్టదని, అది తమ పార్టీ సంస్కృతి కూడా కాదని స్పష్టం చేశారు. వాటిపని అవి చేసుకుంటూ వెళతాయని, అభ్యంతరం ఉన్నవారు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉందని గుర్తుచేశారు. ఇలాంటి అర్థంలేని ఆరోపణలు చేయడం మానుకుని ప్రజల విశ్వాసం పొందేందుకు ప్రయత్నించాలని ప్రతిపక్షాలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హితవు పలికారు.