జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనది: వల్లభనేని వంశీ

Jagan govt is the best says Vallabhaneni Vamsi
  • జగన్ పాలనలో పేదలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్న వంశీ
  • జగన్ ప్రభుత్వంపై తనకు కూడా ఎంతో తృప్తి ఉందని వ్యాఖ్య
  • ప్రజలు ఓటు వేసిన వారే గెలుస్తారన్న వంశీ
ముఖ్యమంత్రి జగన్ పాలనలో రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ ఆత్మగౌరవంతో బతుకుతున్నాయని వల్లభనేని వంశీ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచేది వైసీపీ ప్రభుత్వమని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసిందని అన్నారు. తాను టీడీపీ ప్రభుత్వంలో పనిచేశా, వైసీపీ ప్రభుత్వంలో పని చేశానని... జగన్ ప్రభుత్వమే ఉత్తమమైనదని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వంపై ప్రజలతో పాటు తనకు కూడా ఎంతో సంతృప్తి ఉందని అన్నారు. తనను ఓడిస్తామని నియోజకవర్గంతో సంబంధం లేని వాళ్లు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలని... నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు గెలుస్తారని చెప్పారు. వార్తల్లో నిలిచేందుకు కొత్తగా వచ్చిన వాళ్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటారని విమర్శించారు. 

Go Back to Shorts
Vallabhaneni Vamsi
Jagan
YSRCP

More Telugu News