బీఆర్ఎస్‌కు మరో షాక్... చేజారిన కామారెడ్డి మున్సిపాలిటీ
- బీఆర్ఎస్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవిపై అవిశ్వాసం
- అవిశ్వాసం నెగ్గడంతో పదవి కోల్పోయిన జాహ్నవి
- కొత్త చైర్ పర్సన్‌గా గడ్డం ఇందుప్రియ
49 మంది కౌన్సిలర్లకు గాను 27 మంది అవిశ్వాసానికి మద్దతుగా నిలిచారు. ఇందులో 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు. వారు వెళ్లిపోగా బీఆర్ఎస్‌కు 16 మంది ఉన్నారు. బీజేపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు అవిశ్వాసానికి హాజరు కాలేదు. అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. కొత్త మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన ఇందుప్రియ కామారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.