ఢిల్లీ మద్యం కేసులో తెరపైకి మరో పేరు... కేసులో కీలకంగా వ్యవహరించిన మేక శరణ్?
- కవిత సమీప బంధువు మేక శరణ్ నివాసంలోనూ ఈడీ సోదాలు
- కవితను అరెస్ట్ చేసిన రోజు ఆమె ఇంట్లోనే ఉన్న మేక శరణ్
- అతని ఫోన్ సీజ్ చేసిన ఈడీ అధికారులు
మేక శరణ్‌ను ఇదివరకే రెండుసార్లు ఈడీ విచారణకు పిలిచింది. కానీ అతను హాజరుకాలేదు. సౌత్ లాబీ లావాదేవీల్లో అతను కీలకపాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ముడుపుల చెల్లింపుల వ్యవహారంలో బంధువుల పాత్రపై కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ గుర్తించింది. ఈరోజు మొత్తం ఏడుగురు ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.