కల్వకుంట్ల కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సబంధం లేదు: కిషన్ రెడ్డి
- కవిత పీఏ, బినామీలు అప్రూవర్ గా మారి స్కామ్ వివరాలు ఇస్తున్నారన్న కిషన్ రెడ్డి
- బినామీలతో లిక్కర్ వ్యాపారాలు చేసి మా పార్టీపై విమర్శలు గుప్పిస్తారా? అని మండిపాటు
- అవినీతిపరులను వదిలే ప్రసక్తే లేదని వ్యాఖ్య
ఈడీ అనేది ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని... దానికి అధికారాలు ఉంటాయని చెప్పారు. అవినీతిపరులను వదిలే ప్రసక్తే లేదని అన్నారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని కవిత చెప్పాలని అన్నారు. హైదరాబాద్ లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.