రెస్టారెంట్‌లో దారుణ హత్య.. తలపై కాల్చి, ఆపై కత్తితో గొంతు కోసి దారుణం

రెస్టారెంట్‌లో దారుణ హత్య.. తలపై కాల్చి, ఆపై కత్తితో గొంతు కోసి దారుణం

Property Dealer Shot And Hacked To Death At Pune Highway Restaurant
  • పూణె-సోలాపూర్ జాతీయ రహదారిపై ఘటన
  • రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగానే కాల్పులు జరిపిన దుండగులు
  • పారిపోతున్న బాధితుడిని పట్టుకుని కత్తితో గొంతు కోసి దారుణం
పూణెలో నిన్న సాయంత్రం అందరూ చూస్తుండగా దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన కొందరు దుండగులు అనంతరం పట్టుకుని గొంతు కోసి దారుణంగా హత్యచేశారు. బాధితుడిని 34 ఏళ్ల ప్రాపర్టీ డీలర్ అవినాశ్ బాలు ధాన్వేగా గుర్తించారు. రెండు గ్యాంగుల మధ్య ముఠా శత్రుత్వంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

పూణె-సోలాపూర్ జాతీయ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతున్నాయి. ధాన్వే, మరో ముగ్గురు రెస్టారెంట్‌లోని టేబుళ్ల వద్ద కూర్చున్నారు. సమీపంలోని మరో టేబుల్ వద్ద ఇద్దరు పిల్లలతో కూడిన ఓ కుటుంబం భోజనం చేస్తోంది. ఇద్దరు వ్యక్తులు నెమ్మదిగా నడుచుకుంటూ రెస్టారెంట్‌లోకి వచ్చారు. వారిలో ఒకరి చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. ఆ వెంటనే తుపాకులు తీసి ఫోన్‌లో మాట్లాడుతున్న ధాన్వే తలపై కాల్పులు జరిపారు. దీంతో భయపడిన ధాన్వే, మిగతా ముగ్గురు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. 

ఆ వెంటనే రెస్టారెంట్‌లోకి ఆరుగురు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చారు. నేలపై పడిపోయిన ధాన్వేను పట్టుకొని కత్తులతో దాడిచేసి గొంతు కోసి హత్యచేశారు. టేబుల్ వద్ద భోజనం చేస్తున్న కుటుంబం ఈ ఘటనతో భయపడిపోయి పరుగులుపెట్టడం వీడియోలో కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు నిందితుల కోసం ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. రెండు గ్యాంగుల మధ్య ఉన్న శత్రుత్వమే ఈ ఘటనకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Advertisement
Viral Videos
Pune
Shot Dead
Crime News
Maharashtra

More Telugu News