ఎల్లుండి చిలకలూరిపేటలో భారీ సభ... ప్రధాని మోదీ షెడ్యూల్ ఖరారు
- ప్రజాగళం సభ ఏర్పాటు చేసిన బీజేపీ-టీడీపీ-జనసేన
- కూటమి ఏర్పడ్డాక తొలి సభ
- హాజరవుతున్న ప్రధాని మోదీ
- ప్రధాని వస్తుండడంతో ప్రజాగళం సభకు అత్యంత ప్రాధాన్యం
ఎల్లుండి సాయంత్రం 4.10 గంటలకు ప్రధాని విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ లో బొప్పూడి చేరుకుంటారు. హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆయన సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఈ ప్రజాగళం సభలో మోదీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాల్గొంటారు. సాయంత్రం 6.10 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 6.55 గంటలకు తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టుకు రానున్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు.