ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి దిగంబరావతారం.. హడలిపోయి పరుగులు తీసిన రోగులు, వారి బంధువులు
- మహారాష్ట్రలో ఘటన
- డాక్టర్ వికృత చర్యలు సీసీటీవీలో నమోదు
- చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఆర్యోగ శాఖ
అయితే, రోగులు, వారి బంధువులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో సదరు వైద్యుడు నగ్నంగా కారిడార్ లోకి రావడంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. డాక్టర్ గారి దిగంబరావతారం చూసి రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు. ఆ డాక్టర్ అరాచకత్వం సీసీటీవీలో నమోదైంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ విషయం జిల్లా ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లింది. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ దయానంద్ దీనిపై స్పందిస్తూ, ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, డాక్టర్ నిర్వాకంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఆ వైద్యుడు మద్యం మత్తులో నగ్నంగా ఆసుపత్రిలో తిరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.