చెక్ రిపబ్లిక్ భామ క్రిస్టీనాకు మిస్ వర్డల్-2024 కిరీటం
- ముంబై వేదికగా మిస్ వరల్డ్-2024 పోటీలు
- మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ భామ, రన్నరప్‌గా లెబనాన్ యువతి
- టాప్-8కు పరిమితమైన భారత యువతి సినీ శెట్టి
- ముఖ్య అతిథి నీతా అంబానీకి మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు
భారత్‌కు ఈ పోటీల్లోనూ నిరాశే మిగిలింది. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కన్నడ భామ సినీ శెట్టి టాప్-8 స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకూ ఆమె గట్టిపోటీనే ఇచ్చినా అజైటౌన్ కు (లెబనాన్) టాప్-4లో చోటుదక్కడంతో సినీ శెట్టి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతా అంబానీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్‌వుమన్ జూలియా మోర్లీ.. మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డును ప్రదానం చేశారు.