అమిత్ షా నివాసానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సంతోషకర ప్రకటన వస్తుందన్న రఘురామకృష్ణరాజు
- అమిత్ షా నివాసంలో కొనసాగుతున్న భేటీ
- భేటీ తర్వాత మీడియాతో చంద్రబాబు, పవన్ మాట్లాడే అవకాశం
- అరగంటలో ప్రకటన వస్తుందన్న రఘురాజు
త్వరలో జరగబోయే ఎన్డీయే భేటీకి టీడీపీ, జనసేన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి కోసం కేంద్ర సహకారం అవసరమని టీడీపీ భావిస్తోంది. జనసేన, బీజేపీ కలిసి 8 లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది. అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
మరోవైపు ఈ భేటీపై ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ... పొత్తుపై మరో 20, 30 నిమిషాల్లో ప్రకటన వస్తుందని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల వాళ్లంతా సంతోషించే ప్రకటన వస్తుందని అన్నారు.