ఏముందని ఈ కేసును టీవీ సీరియల్ మాదిరి సాగదీస్తున్నారు?: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- లిక్కర్ కేసులో తాను కూడా బాధితురాలినేనని అన్న కవిత
- రాజకీయాల్లో విలువలకు చోటు లేకుండా పోయిందని విమర్శ
- ఆదర్శ్ కుంభకోణంలో ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపాటు
అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో రేవంత్ పాలన కొనసాగుతోందని కవిత విమర్శించారు. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, వెంటనే ఆమెను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. జీవో 3తో ఉద్యోగాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. మహిళకు జరుగుతున్న అన్యాయంపై ఉమెన్స్ డే రోజున ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో నిరసన తెలిపేందుకు అనుమతిని ఇవ్వడం లేదని మండిపడ్డారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా తమ పోరాటం ఆగదని తెలిపారు.