బయాప్సీ ఫలితాల కోసం రోజుల తరబడి నిరీక్షణకు తెర.. కేవలం 5 నిమిషాల్లోనే మన చేతికి రిజల్ట్
- ఇంతకుముందు ఫలితాలకు ఐదు రోజులు
- వివాస్కోప్ సాంకేతికత ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఫలితాల వెల్లడి
- గచ్చిబౌలిలోని ఏఐజీలో మొదటిసారి అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ
ఈ సందర్బంగా ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జీవీ రావు, పాథాలజీ డైరెక్టర్ వైద్యురాలు అనురాధ బుధవారం ఈ సాకేంతికత వివరాలను మీడియాకు వెల్లడించడం జరిగింది. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు బయాప్సీ ఫలితాల కోసం ఐదు రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల్లోనే ఫలితాలు మన చేతికి వచ్చేస్తాయి. వివాస్కోప్ టెక్నాలజీ కారణంగానే ఇది సాధ్యమైంది. తద్వారా వేగంగా రోగ నిర్ధారణ చేసి చికిత్స చేయడం ద్వారా రోగికి మెరుగైన ఫలితాలను అందించే వెసులుబాటు కలుగుతుంది. ప్రధానంగా జీఐ క్యాన్సర్లకు సంబంధించి సత్వర నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఈ సాంకేతికత చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.