ఉమ్మడి విశాఖ జిల్లాలో వచ్చే వారం సీఎం జగన్ పర్యటన
- ఈ నెల 5న వైజాగ్‌లో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్
- విశాఖలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిపై, భవిష్యత్తు ప్రాజెక్టులపై ప్రజెంటేషన్
- నగర అభివృద్ధి కోసం నిపుణుల, పారిశ్రామికవేత్తల నుంచి సలహాల సేకరణ
- ఈ నెల 7న అనకాపల్లిలో ‘చేయూత ’ సభలో పాల్గొననున్న సీఎం
సీఎం రెండు రోజుల పర్యటన ఏర్పాట్లపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ జిల్లా కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. విశాఖలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామో చెప్పాలనే ఉద్దేశంతో డైలాగ్ ఆన్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.