బెంగాల్లో ఎప్పుడు అరెస్ట్ జరగాలో కూడా నేరగాళ్లే నిర్ణయించుకునే పరిస్థితి ఉంది: ప్రధాని మోదీ
- రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ధీమా
- మమతా బెనర్జీ ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్య
- రాష్ట్రంలో బాధితుల సమస్యలను బెంగాల్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ
దౌర్జన్యాలు, రాజవంశ రాజకీయాలు, ద్రోహాలకు టీఎంసీ పర్యాయపదంగా నిలిచిందని విమర్శించారు. రాష్ట్రంలో బాధితుల సమస్యలను బెంగాల్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక్కడ వేధింపులకు గురైన తల్లులు, సోదరీమణులు న్యాయం కోసం పోరాడుతుంటే వారికి అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడుతోందన్నారు.