మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమంగా వేసిన రోడ్డు తొలగింపు

Shock to Mallareddy
  • హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును తొలగించిన అధికారులు
  • 2,500 గజాల భూమిని ఆక్రమించి రోడ్డు వేసిన మల్లారెడ్డి
  • ఈ అంశంపై ఎంపీగా ఉన్నప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. 2,500 గజాల భూమిని ఆక్రమించి ఈ రోడ్డును నిర్మించారు. తన కాలేజీ కోసం మల్లారెడ్డి ఈ రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండీఏ లేఔట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును ఈరోజు అధికారులు తొలగించారు.
Go Back to Shorts
Malla Reddy
brs
HMDA
Road
Revanth Reddy
Congress

More Telugu News