శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్!

Vehicles allowed during night time in Srisailam due to bramotsavams
  • ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లోనూ శ్రీశైలానికి వాహనాల రాకపోకలకు అనుమతి
  • మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అటవీ శాఖ నిర్ణయం
  • రాత్రివేళల్లో వాహనాలను నెమ్మదిగా నడపాలని అధికారుల సూచన
  • నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు ఓ గుడ్ న్యూస్. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులను ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు. 

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం..పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే వాహనాలను ఆపేస్తారు. అయితే, బ్రహ్మోత్సవాల కోసం వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు. వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలని దోర్నాల క్షేత్రాధికారి సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు.
Go Back to Shorts
Srisailam
Andhra Pradesh

More Telugu News