ఐరాస మానవ హక్కుల మండలిలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రసంగం
- గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా మానవతా సంక్షోభం ఉత్పన్నమవుతోందని ఆందోళన
- రెండు దేశాలు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్న సూచన
- ఉగ్రవాదం, అమాయకులను బందీలుగా మార్చుకోవడాన్ని సహించేది లేదన్న జైశంకర్
- ఐరాస మానవ హక్కుల 55వ సెషన్‌లో వీడియో లింక్ ద్వారా మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి
మానవ హక్కుల సంస్థాగత హామీలకు భారత్ కట్టుబడి ఉంటుందని జైశంకర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో భారత్ సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ సవాళ్లకు సమర్థవంతమైన ప్రతిస్పందన కోసం బహుళ పాక్షిక విధానాలను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా జైశంకర్ అన్నారు.