ట్రూకాలర్‌తో ఇక పనిలేనట్టే.. అందుబాటులోకి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ ఫీచర్!
- టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా ప్రతిపాదనలు
- దేశీయ టెలికం కంపెనీలన్నీ తప్పనిసరిగా అమలు చేయాల్సిందే
- డిఫాల్ట్‌గా యూజర్లకు అందుబాటులోకి
- సిమ్ తీసుకున్నప్పుడు రిజిస్టర్ అయిన పేరు ప్రదర్శితం
వినియోగదారుల అభ్యర్థిన మేరకు సప్లిమెంటరీ సర్వీస్‌గా అన్ని టెల్కోలు ‘కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అందించాలని ట్రాయ్ తన చివరి సిఫార్సుల సెట్‌లో ప్రతిపాదించింది. అయితే, ఈ సర్వీసులు ఇండియాలో డిఫాల్ట్‌గా అందుబాటులోకి రానున్నాయి. సిమ్‌కార్డు తీసుకున్నప్పుడు నమోదు చేసుకున్న పేరు కాల్ చేసేటప్పుడు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. యూజర్ అభ్యర్థనపై మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుంది.