హైదరాబాద్ రంజీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్
- రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ టైటిల్ గెలిచిన హైదరాబాద్ జట్టు
- ఎలైట్ గ్రూప్ పోటీలకు అర్హత
- ఎలైట్ టైటిల్ సాధిస్తే బీఎండబ్ల్యూ కారు, రూ.1 కోటి నగదు ఇస్తామని ప్రకటన
ఈ నేపథ్యంలో, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు అరిశనపల్లి హైదరాబాద్ రంజీ ఆటగాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే మూడేళ్లలో హైదరాబాద్ జట్టు రంజీ ట్రోఫీ ఎలైట్ టైటిల్ విజేతగా నిలిస్తే... ప్రతి ఒక్క ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు, రూ.1 కోటి నగదు నజరానా అందిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.