వసంతపంచమి రోజు త్రిపుర కాలేజీలో సరస్వతీదేవి విగ్రహానికి అవమానం.. ఆచ్ఛాదన లేని విగ్రహానికి పూజలు
- వసంతపంచమని పురస్కరించుకుని ప్రభుత్వ కాలేజీలో పూజలు
- విగ్రహంపై ఆచ్ఛాదన లేని విషయాన్ని గుర్తించిన ఏబీవీపీ
- ఏబీవీపీ నిరసనలకు బజరంగ్‌దళ్ మద్దతు
- కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
సరస్వతీదేవి విగ్రహాన్ని అవమానించిన కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ డిమాండ్ చేసింది. అమ్మవారి విగ్రహంపై వెంటనే చీర కప్పాలని సూచించింది. ఈ విషయంలో త్రిపుర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ గొడవపై స్పందించిన కళాశాల యాజమాన్యం వివరణ ఇచ్చింది. తాము పూజించిన సరస్వతీదేవి విగ్రహం హిందూదేవాలయాల్లోని సంప్రదాయ శిల్ప రూపాలకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు. చివరికి ఒత్తిడి పెరగడంతో విగ్రహాన్ని మార్చారు.