ఏపీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్ల విడుదల
- 897 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్
- ఫిబ్రవరి 25న గ్రూప్-2 స్క్రీనింగ్ టెస్ట్
- హాల్ టికెట్లను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచిన ఏపీపీఎస్సీ
897 ఉద్యోగాలతో ఏపీ ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రకటించడం తెలిసిందే. నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం... ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. ఈసారి గ్రూప్-2 ఉద్యోగాలకు 4 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.