ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ
- బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి
- బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేయాలని వ్యాఖ్య
- బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన కవిత
అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందన్నారు. బీసీల సంక్షేమం కోసం రాబోవు ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్‌లో 20 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని కోరారు. ఈ మేరకు నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అవుతుందన్నారు. బీసీల అభివృద్ధికి ఈ నిధులు దోహదపడతాయన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేయాలన్నారు. అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.