సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
- జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్
- రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ ట్వీట్
- పది రూపాయల డ్రింక్ తాగుతూ కూర్చున్న ఫొటోను ట్వీట్ చేసిన కాంగ్రెస్ ఫర్ తెలంగాణ
ప్రజల ముఖ్యమంత్రి అంటూ ట్వీట్
రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ఎక్స్ హ్యాండిల్ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. హెలికాప్టర్‌లో కూర్చున్న రేవంత్ రెడ్డి పది రూపాయల రియల్ ఫ్రూట్ తాగుతూ ఉన్నారు. ఈ ఫొటోను క్లిక్ మనిపించి షేర్ చేశారు. "పదవి అనేది హోదా కాదు.. బాధ్యత అని రేవంత్ రెడ్డిని చూస్తే అర్థం అవుతుంది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.