మేడారం జాతర సమయంలో మహిళల నుంచి టికెట్ వసూలు చేద్దామన్న సజ్జనార్.. వద్దన్న భట్టి విక్రమార్క!
- వచ్చే నెల 18 నుంచి 25 వరకు మేడారం జాతర
- 6 వేల ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
- మహిళల నుంచి టికెట్ వసూలు చేస్తే ఆదాయం పెరుగుతుందన్న సజ్జనార్
- అలాంటి పనులు వద్దన్న మంత్రి భట్టి విక్రమార్క
స్పందించిన భట్టి.. అది సరికాదని, ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్క మేడారమే కాదని, ఏ జాతర సమయంలోనూ మహిళల నుంచి టికెట్ వసూలు చేయవద్దని ఆదేశించారు. వచ్చే నెల 18 నుంచి 25 వరకు జరగనున్న మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 6 వేల బస్సులు నడపాలని నిర్ణయించింది. ఒక్క హైదరాబాద్ నుంచే 2 వేల బస్సులను సిద్ధం చేస్తున్నారు.