ఈ నెల 27 నుంచి ఏపీ సీఎం జిల్లాల పర్యటన
- మొత్తం 26 జిల్లాలకు కలిపి ఐదు బహిరంగ సభల ఏర్పాటు
- భీమిలిలో తొలి బహిరంగ సభ ఏర్పాటు
- ఫిబ్రవరి 10లోపు అన్ని సభలు పూర్తయ్యేలా షెడ్యూల్ ఖరారైనట్టు పార్టీ వర్గాల వెల్లడి
ఈ నెల 27న ఉత్తరాంధ్రలోని భీమిలిలో తొలి బహిరంగ సభ జరుగుతుంది. మొత్తం 26 జిల్లాలకు కలిపి అయిదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 10లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ ఖరారైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.