తొలి రోజు అయోధ్య రామాలయం వద్ద భక్తజన సంద్రం.. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం.. వీడియో ఇదిగో
- పెద్ద సంఖ్యలో రామాలయానికి తరలివచ్చిన భక్తజనం
- వేకువజామున 3 గంటలకే చేరుకున్న కొందరు భక్తులు
- అక్కడక్కడా చిన్నపాటి తోపులాటలు
- తొలిరోజు సుమారు 5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించవచ్చని అంచనా
కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చు. ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు.