తెలంగాణ గవర్నర్ తమిళిసైకి తనయుడి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల
- ఈ నెల 18న నిశ్చితార్థం.. ఫిబ్రవరి 17న రాజారెడ్డి వివాహం
- రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్‌కు పత్రికను అందించిన షర్మిల
- కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తమిళిసై-షర్మిల
ఇటీవల ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు పత్రికను అందించారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసైని రాజ్ భవన్‌లో కలిసి కొడుకు పెళ్లి పత్రికను అందించి... ఆహ్వానించారు. తన కొడుకు పెళ్లికి తప్పకుండా రావాలని కోరారు. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు.