సొంత గ్యాంగ్ చేతిలోనే హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్
- పూణేలో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో హత్య
- పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన వైనం
- 8 మంది అనుమానితుల అరెస్ట్
- ఇది గ్యాంగ్‌వార్ కాదన్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
మొహొల్‌పై పలు హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అనుమానిత ఉగ్రవాది మొహమ్మద్ ఖతీల్ సిద్ధిఖీని యరవాడ జైలులో హత్యచేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ నిర్దోషిగా బయటపడ్డాడు. కాగా, మొహొల్ హత్యకు భూ తగాదాతోపాటు డబ్బులకు సంబంధించిన గొడవే కారణమని పోలీసులు తెలిపారు. ఇది గ్యాంగ్‌వార్ కాదని, సొంత గ్యాంగ్ చేతిలోనే మొహొల్ హత్యకు గురయ్యాడని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.