ఆ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసే కుట్ర చేస్తోంది... నిరసన చేపట్టండి: కేటీఆర్ పిలుపు
- గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ పథకాలను రద్దు చేసే కుట్ర చేస్తోందని విమర్శ
- ప్రజలకు లబ్ది కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు
- ఈ పథకాలు రద్దు చేయడమంటే బలహీనవర్గాలకు ద్రోహం చేయడమేనని వ్యాఖ్య
ప్రజలకు లబ్ది కలిగించే సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గృహలక్ష్మి, దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి పథకాలను రద్దు చేయకుండా లబ్దిదారుల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడించారు. దళితబంధు, గొర్రెల పంపిణీ రద్దు చేయడమంటే బలహీనవర్గాలకు, దళితులకు తీరని ద్రోహం చేసినట్లే అని మండిపడ్డారు. పట్టణాలకు గత ప్రభుత్వం కేటాయించిన నిధులు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ రోడ్ల వంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా రద్దు చేస్తోందన్నారు.