Tammineni Sitaram: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. శ్రీకాకుళంలోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. గురువారం రాత్రి నీరసంగా ఉన్న ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావు పలు వైద్య పరీక్షలు చేశారు. ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, అందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక రోజు పర్యవేక్షణలో ఉంచి తరువాత డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు.