కొత్త సంవత్సరం తొలి రోజునే ఇస్రో ప్రయోగం
- సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్ఎల్‌వీ సీ58 ప్రయోగం
- ఈ ప్రయోగంలో ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్న ఇస్రో
- ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం
- శ్రీహరికోటలోని షార్ సెంటర్‌లో ప్రయోగం
ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభయ్యే కౌంట్ డౌన్ సోమవారం రాకెట్ ప్రయోగంతో ముగుస్తుంది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈమారు ఎక్స్-రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడం ఈ మిషన్ లక్ష్యం. ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు. ఈమారు ఎక్స్‌పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్‌లను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు.