పార్టీ టిక్కెట్ ఇస్తే చేవెళ్ల నుంచి లోక్ సభకు పోటీ చేస్తా: బీజేపీ నేత సుదర్శన్ తివారి

BJP leader Sudarshan ready to contest from Chevella
  • అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ అడగలేదన్న సుదర్శన్  
  • జాతీయస్థాయి అంశాలే ప్రాధాన్యతగా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని వ్యాఖ్య
  • తనకు టిక్కెట్ ఇస్తే అన్ని వర్గాల ఆశీస్సులతో గెలుస్తానని ధీమా
రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకులు సుదర్శన్ ప్రసాద్ తివారీ కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని చెబుతున్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... పార్టీ ఆదేశిస్తే తాను చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తాను టిక్కెట్ అడగలేదని... ఇప్పుడు లోక్ సభకు ఆశిస్తున్నానన్నారు. జాతీయస్థాయి అంశాలే ప్రాధాన్యతగా ఎంపీ ఎన్నికలు జరుగుతాయని... ఈ క్రమంలో తనకు టిక్కెట్ ఇస్తే అన్ని వర్గాల ఆశీస్సులతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Advertisement
BJP
Telangana

More Telugu News