29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం.. ఏపీ ప్రభుత్వానికి నెట్‌వర్క్ ఆసుపత్రుల లేఖ
- ఆరోగ్యశ్రీ కింద రోగులను చేర్చుకోబోమని వెల్లడి
- హామీ ఇచ్చి పరిష్కరించలేదని ప్రభుత్వంపై ఆగ్రహం
- పెండింగ్ బిల్లులు, పలు శస్త్రచికిత్సల ఛార్జీల పెంపు డిమాండ్లు పరిష్కరించకపోవడంతో నిర్ణయం
కాగా ఆసుపత్రులకు వెయ్యి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. పలు శస్త్ర చికిత్సలకు సంబంధించిన ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గతంలో డెడ్‌లైన్‌ను విధించిన సంగతి తెలిసిందే.