కుటుంబపరమైన కారణాలతో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చిన కోహ్లీ

కుటుంబపరమైన కారణాలతో దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చిన కోహ్లీ

Kohli returned India from South Africa
  • దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న భారత జట్టు
  • ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ లు పూర్తి
  • డిసెంబరు 26 నుంచి రెండు టెస్టుల సిరీస్
  • కుటుంబపరమైన ఎమర్జెన్సీతో కోహ్లీ భారత్ వచ్చాడన్న బీసీసీఐ వర్గాలు
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా, టెస్టు సిరీస్ ముంగిట ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చాడు. కోహ్లీ కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చాడని, దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి జరిగే తొలి టెస్టు నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే, కోహ్లీ ఏ కారణాలతో భారత్ వచ్చాడన్నది బోర్డు వెల్లడించలేదు. కాగా, కోహ్లీ అర్ధాంగి అనుష్క శర్మ మరోసారి గర్భవతి అయిందని ఇటీవల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కోహ్లీ, అనుష్క దంపతులకు వామిక అనే కుమార్తె ఉంది.
Advertisement
Virat Kohli
Family
India
South Africa
Test Series

More Telugu News