ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కోసం అధికారిక నివాసం రెడీ.. కేసీఆర్ నేమ్‌ప్లేట్ తొలగింపు
- ఢిల్లీ తుగ్లక్ రోడ్ 23లో రేవంత్‌కు ఇల్లు
- మరమ్మతులు చేసి సిద్ధం చేసిన అధికారులు
- ఇదే ఇంట్లో 20 ఏళ్లపాటు ఉన్న కేసీఆర్
- అధికారం కోల్పోవడంతో ఖాళీ చేసిన వైనం
రేవంత్‌కు కేటాయించిన ఈ ఇంట్లో కేసీఆర్ దాదాపు 20 సంవత్సరాలపాటు ఉన్నారు. 2004లో కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ ఈ ఇంటికి మారారు. ఆ తర్వాత ఉద్యమ నేత, సీఎంగా ఈ ఇంటిని కొనసాగించారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో ఖాళీ చేయక తప్పలేదు. కేసీఆర్‌కు సంబంధించిన వస్తువులను ఆ ఇంటి నుంచి ఇటీవలే అధికారులు తరలించారు. కాగా, నేడు ఢిల్లీ వెళ్తున్న రేవంత్‌రెడ్డి ఇదే ఇంట్లో దిగుతారా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు.