Police: యువతి ఫిర్యాదు... ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

Youtuber arrested by Narsingi police
  • రెండేళ్ల క్రితం పుట్టిన రోజు వేడుకలని పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లుగా యువతి ఫిర్యాదు
  • యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు
  • యూట్యూబర్ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు
ప్రముఖ యూట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. తనను ప్రేమించి... పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం... ఏప్రిల్ 25, 2021న పుట్టిన రోజు వేడుకలు అంటూ బాధిత యువతిని పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్‌తో పాటు అతని తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కేసు నమోదయింది. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Police
Hyderabad
woman
Crime News

More Telugu News