Ch Malla Reddy: అవసరమైతే కాంగ్రెస్ కు మద్దతిస్తా: మాజీ మంత్రి మల్లారెడ్డి

If needed I will give support to Congress says Malla Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్లిపోతుంది. 'పాలమ్మినా, పూలమ్మినా, బోర్లు వేసినా' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 

ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే... ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి అన్నారు. శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్ కు సభ్యులు తక్కువైతే మద్దతిస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా... కచ్చితంగా ఇస్తానని ఆయన బదులిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని... ఆ తర్వాత అందరం ఒక్కటేనని ఆయన వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Ch Malla Reddy
BRS
Teenmaar Mallanna

More Telugu News