jagityal: కోరుట్ల ఎమ్మెల్యేకు కంటి పరీక్షలు నిర్వహించిన జగిత్యాల ఎమ్మెల్యే

Jagityal MLA tests Korutla MLA Sanjay
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్‌ కంటి పరీక్ష నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర రావు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి సంజయ్, జగిత్యాల నుంచి ఎం.సంజయ్ కుమార్ విజయం సాధించారు. వీరిద్దరూ డాక్టర్లే. జగిత్యాల ఎమ్మెల్యే కంటి వైద్య నిపుణులు. ఈ నేపథ్యంలో కోరుట్ల ఎమ్మెల్యే బుధవారం ఆయన ఇంటికి వెళ్లారు. కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇద్దరిదీ ఒకే పేరు... ఇద్దరూ వైద్యులు కావడంతో ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోను విద్యాసాగర రావు ట్వీట్ చేస్తూ... 'కోరుట్ల ఎమ్మెల్యేకు కంటి పరీక్షలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే గారు' అని పేర్కొన్నారు.
jagityal
korutla
mla
BRS

More Telugu News